జనంసాక్షి, మంథని : లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ కార్మికుల కోసం తెలంగాణ భవన, ఇతర నిర్మాణ సంక్షేమ మండలి ద్వారా ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం సిఎస్సి హెల్త్ కేర్ ద్వారా కమాన్పూర్ మండల కేంద్రంలో సోమవారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ ని మంథనిలో వారి కార్యాలయంలో కలిసి సిఎస్సి కరపత్రాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరించి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందన్నారు. కమాన్పూర్ మండల లోని వివిధ గ్రామాల నిర్మాణ కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, సిఎస్సి జిల్లా ఇన్చార్జ్ తిరుపతి, కమాన్పూర్ మండలం భవన నిర్మాణ నాయకులు లక్ష్మీనారాయణ, లింగయ్య, మల్లయ్య, సుధాకర్, నగేష్, సదయ్య, పాల్గొన్నారు.




