జనం సాక్షి , మంథని : ఏఐసిసి కార్యదర్శి , మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇన్చార్జిగా వచ్చాక హైదరాబాద్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అయిందని, శ్రీధర్ బాబు సిన్సియర్ గా పార్టీ గెలుపు కోసం కష్టపడి పని చేస్తున్నారని, ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శుల్లో శ్రీధర్ బాబు చాలా సిన్సియర్ అని కర్ణాటక కు చెందిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, ఎఐసిసి సెక్రటరీ బోస్ రాజ్ కొనియాడారు. శ్రీధర్ బాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ కర్ణాటక పరిధిలోని టిక్కెట్ల కేటాయింపుల్లో శ్రీధర్ బాబుపై , తన గురించి తెలంగాణలోని పలు పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, అర్థరహితమని అన్నారు. ఈ మేరకు బోస్ రాజ్ మీడియాకు వీడియో రిలీజ్ చేశారు. కర్ణాటక టిక్కెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికలో తాను సైతం మెంబర్ ను అని, అభ్యర్థుల ఎంపిక కోసం పలుమార్లు రాహుల్ గాంధీతో భేటీ కావడం జరిగిందన్నారు. తన గురించి తప్పుడు వార్తలు రాసిన తెలంగాణకు చెందిన సదురు పత్రికలపై , ఆ పత్రికలను ప్రోత్సహిస్తున్న వ్యక్తులపై కోర్టులో పరునష్టం దావా వేయడంతో పాటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.




