Thursday, 5 November 2026

జిల్లా వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్ గా రాయపూడి భవాని

జిల్లా వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్ గా రాయపూడి భవాని
మిర్యాలగూడ,, జనం సాక్షి.
ఇటీవల జరిగిన నల్గొండ జిల్లా వాసవి క్లబ్ అంతర్జాతీయ
వి 104 ఏ సమావేశం లో ఎన్నుకున్న నూతన కార్యవర్గంలో మిర్యాలగూడ పట్టణానికి చెందిన రాయపూడి భవానిని రీజినల్ చైర్మన్ గా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నూతన గవర్నర్ గురుమూర్తి, మాజీ అధ్యక్షులు ఐతా రాములు లు రాయపూడి భవాని తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల సేవా కార్యక్రమాల నిర్వహణ విషయంలో, క్లబ్ అభివృద్ధి విషయంలో కృషి చేయాలని సూచించారు. రీజినల్ చైర్మన్ గా ఎంపిక కాబడ్డ రాయపూడి భవాని మాట్లాడుతూ జిల్లా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు మరింత గుర్తుకు వచ్చే విధంగా తాను కృషి చేస్తానని అన్నారు.ప్రస్తుత గవర్నర్ కోటగిరి రామకృష్ణ, అయితా రాములు, ఇరుకుల రామకృష్ణ మరియు వాసవి క్లబ్ ల పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు