అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ :మంత్రి మల్లారెడ్డి : శామీర్ పేట్, జనం సాక్షి :శామీర్ పేట్ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో జరిగిన శామీర్పేట్ మండలం మరియు తుంకుంట మున్సిపాలిటీకి మంజూరు అయినా షాదీ ముబారక్ మరియు కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని
శామీర్పేట్ మండలానికి 42 తుంకుంట మున్సిపాలిటీకి 15 మొత్తం 57 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణి చేశారు .ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే సి.యం కే.సి.ఆర్ లక్ష్యం.
ముఖ్యమంత్రి కే.సి.ఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శకంగా ఉన్నారన్నారు.
పేదల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది.అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తున్నయని తెలిపారు.
మన ముఖ్యమంత్రి కే.సి.ఆర్ పేదింటి ఆడబిడ్డలకు సొంత మేనమామ లాగా ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లి ల భారాన్ని తగ్గిస్తున్నారు.
ఆడబిడ్డ వివాహానికి ఆర్థికంగా ఆదుకొని ప్రభుత్వం అండగా నిలుస్తుంది
ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లికానుకగా 1,00,116 ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రవేశ పెట్టిన ఇలాంటి పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేదు,కేవలం కె.సి.ఆర్ సర్కార్ మాత్రమే అమలు చేస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రి లో ప్రసవం,కే.సి.ఆర్ కిట్ మొదలుకొని ఆడపిల్ల పెళ్లి చేసేవరకు ఇంట్లో పెద్దన్నగా ఎంతో మంది పేద కుటుంబాలకు అండగా నిలిచారు.
ఈ పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ కి దక్కుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీపీ ఎల్లుబాయ్, జడ్పీటీసీ అనిత డీసీఎంస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, తుంకుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావు, వైస్ చైర్మన్ వాణి వీరా రెడ్డి, ఎంపీడీఓ వాణి,కౌన్సిలర్లు,ఎంపీటీసీలు, సర్పంచ్లు,కో అప్షన్ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు సుదర్శన్, తుంకుంట మున్సిపల్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
21ఎస్పీటీ -1: చెక్ లను పంపిణి చేస్తున్న మంత్రి మల్లారెడ్డి, చైర్మన్ రాజేశ్వర్ రావు
అన్నపూర్ణ రాష్ట్రంగా తెలంగాణ :మంత్రి మల్లారెడ్డి :




