దోమ మార్చి 25(జనం సాక్షి)
గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులో భాగంగా జాతీయస్థాయి అవార్డులలో జిల్లాస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డు అందుకోవడం జరిగిందని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు. శనివారం వికారాబాద్ కలెక్టరేట్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి,కలెక్టర్ నారాయణరెడ్డి,జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ చేతుల మీదగా జిల్లా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డును సర్పంచ్ యశోద తిరుపతి సాగర్, సెక్రటరీ సంతోషి అందుకోవడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ మాట్లాడుతూ…పారిశుద్ధ్యం, విద్యా, వైద్యం, పాలనతదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు రావడం జరిగిందని, అభివృద్ధిలో ఎప్పటికప్పుడు సూచనలు ఇచ్చిన మండల అధికారులకు, అభివృద్ధిలో సహకరించిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నాగిరెడ్డి,ఎంపీపీ అనసూయ, ఎంపీడీవో జయరాం, ఎంపీఓ సోమలింగం, తిరుపతి సాగర్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ జిపిగా పాలేపల్లి




