జనం సాక్షి, ముత్తారం : ఏఐసీసీ పిలుపు మేరకు, ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ముత్తారం మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్ర చౌరస్తాలో శనివారం కాంగ్రెస్ నాయకులు మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. రాహుల్ గాంధీనీ పార్లమెంటు నుండి సస్పెండ్ చేస్తూ లోక్ సభ సభ్యత్వ రద్దు చేయడాన్ని నిరసిస్తూ మోడీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బియ్యని శివకుమార్, ఉపాధ్యక్షుడు గాదం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు సమ్మయ్య , దాసరి చంద్రమౌళి ,నెత్తెట్ల మల్లయ్య యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు రత్న నాగరాజు, ఎస్సి సేల్ గ్రామ శాఖ అధ్యక్షుడు మేదరి శేఖర్,ముత్తారం మండల సోషల్ మీడియా ఇంచార్జి కోల విజయ్, సీనియర్ నాయకులు చేలకల జితేందర్, గుడి రాములు,బియ్యని రాజబాబు, చేరాల వెంకటయ్య, పీక శంకర్, ఎడవేన కమలాకర్,అమ్ము రవీందర్, జక్కుల రమేష్, వేలిమారెడ్డి శ్రీనివాస్ రెడ్డి,గుడి కొండాల్ రెడ్డి, నెత్తెట్ల శ్రావణ్,సుదాడి సంపత్రావు,రజాక్, మహ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం




