నాంపల్లి జనవరి 16 (జనం సాక్షి)నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో సౌరబ్ సేనా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలు సోమవారం విజయవంతంగా ముగిసాయి. ఈ టోర్నమెంట్ ప్రధమ బహుమతి దామెర సర్పంచ్ దామెర యాదగిరి, ద్వితీయ బహుమతి కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి స్పాన్సర్ చేయడం జరిగింది.ఈ టోర్నమెంట్ లో ప్రధమ బహుమతి రూ.20,000 లు నాంపల్లి క్రీడాకారులు దక్కించుకున్నారు. ద్వితీయ బహుమతి కొదాస్ పల్లి క్రీడాకారులు 10,000 లు దక్కించుకున్నారు.అదేవిధంగా నాంపల్లి చోటు టోర్నమెంట్ మెయింటినెన్స్ కొరకు 20,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం శ్రీను, గాదెపాక శ్రీకాంత్,నాంపల్లి సతీష్,కర్నె యాదయ్య,కోనేటి సాయి, నరేష్ ,ఎదుళ్ల కోటేష్ తదితరులు పాల్గొన్నారు.




