నాంపల్లి జనవరి 16( జనం సాక్షి )ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ద్వారా పశుగాసం విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని వెటర్నరీ డాక్టర్ స్వాతి అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పశువైద్యశాల లో పశుగ్రాసం విత్తనాలు 5 కేజీలకు 438 రూపాయలు ఉండగా సబ్సిడీ ద్వారా 110 రూపాయలకు రైతులకు విక్రయిస్తున్నట్టు డాక్టర్ స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ హమీద్, సుంకిశాల ఓ ఎస్ చాంద్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ ద్వారా పశుగ్రాసం పంపిణీ




