జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన లో మొదటి బహుమతి సాధించిన పదర విద్యార్థులు, జనం సాక్షి పదర: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో మూడు రోజుల నుండి జరుగుతున్న జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శన లో పదర మండల కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులు జిల్లా మొదటి బహుమతి సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలకిషన్ తెలిపారు, పాఠశాలకు చెందిన బాబు, రవి తేజ, ప్రకృతి సిద్ధంగా వాటర్ ఫిల్టర్ తయారు చేసినందుకు గాను జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించినట్లు ఆయన తెలిపారు, గురువారం నాడు ఏర్పాటుచేసిన బహుమతుల ప్రధానోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ముఖ్యఅతిథిగా హాజరైనట్లు ఆయన తెలిపారు, ఈ సందర్భంగా జిల్లా మొదటి బహుమతి సాధించిన విద్యార్థులకు 4 వేల నగదు బహుమతిని అందజేశారని, అదేవిధంగా డీఈఓ గోవిందరాజులు గెలుపొందిన విద్యార్థులకు కప్పు తో పాటు ప్రశంస పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు, జిల్లాస్థాయిలో మొదటి బహుమతి సాధించిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనకు వెళతారని బాలకిషన్ తెలిపారు, జిల్లాస్థాయి లో మొదటి బహుమతి సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులు సదానంద చారి, గోపాల్, జయపాల్, పి ఈ టి ఆంజనేయులు ,శ్రీనివాసులు, నిరంజన్, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు ,విద్యార్థులను అభినందించారు
జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన లో మొదటి బహుమతి




