Tuesday, 3 November 2026

పోలీసులు ‘మీ కోసం’ లో భాగంగా పోలీసులు ‘మీ కోసం

పోలీసులు ‘మీ కోసం’ లో భాగంగా పోలీసులు ‘మీ కోసం’ లో భాగంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ నోట్ బుక్స్ అందజేత
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:  కాగజ్ నగర్ టౌన్:(జనం సాక్షి)01 డిసెంబర్ కాగజ్ నగర్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో పదవ తరగతి బాలికలకు పోలీసులు మీకోసం కార్యక్రమంలో కస్తూరి ఫౌండేషన్ సౌజన్యంతో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగ్స్ వాటర్ బాటిల్ ప్లేట్లు పరీక్ష ప్యాడు నోట్ బుక్స్ పెన్నులు పెన్సిల్స్ విద్యా సామాగ్రి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని సమాజంలో మంచి పేరు తీసుకుని రావాలని కోరారు వచ్చే పదవ తరగతి పరీక్షలలో 10/10 సాధించిన విద్యార్థులకు 5000 రూపాయల నగదు బహుమతి  జిల్లా ఎస్పీ శ్రీ కె సురేష్ కుమార్  ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు, విద్యార్థులందరూ  సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు,  విద్యాలయ ఇంచార్జ్ ప్రత్యేక అధికారిని  కే జ్యోతి  మాట్లాడుతూ  మా పాఠశాల బాలికలకు విద్యా సామాగ్రిని అందజేసిన సిఐ రవీందర్ సార్ గారికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో  విద్యాలయ మహిళా ఉపాధ్యాయులు రాణి స్వాతి లక్ష్మీ ప్రసన్న విజయలక్ష్మి గీత విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు