హైదరాబాద్: గ్రేటర్ హైదారబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై హైకోర్టు స్పష్టమైన తీర్పు వెలువరించింది. డిసెంబర్ 15 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు టీసర్కార్ ను ఆదేశించింది. 180 రోజుల్లో వార్డుల రిజర్వేషన్ల పునర్విభజన పూర్తి చేయాలని ఆదేశించింది. ఇదిలావుంటే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆరు నెలల అదనపు సమయం కోరింది. నగరంలో మొత్తం 63 లక్షల మంది జనాబా ఉందని.. సింగపూర్ సిటీ అంతా పెద్దదిగా ఉందని… ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.




