హైదరాబాద్ నగర శివార్లలోని జీడిమెట్లలో గత కొన్ని రోజులుగా నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండు చేస్తూ పెద్దఎత్తున మహిళలు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. మంచినీటి సమస్యను తీర్చే వరకూ తాము రోడ్డుపై నుంచి కదిలేది లేదని మహిళలు చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు తరలివచ్చి మహిళలను రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.




