హైదరాబాద్ : అక్రమంగా మలేషియా నుంచి తీసుకువస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మలేషియా నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 1.2 కిలోల బంగారాన్ని కనుగొన్నారు.ఈ బంగారానికి ఎలాంటి పత్రాలు లేకపోవటం అధికారులు దాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నారు.




