Thursday, 5 November 2026

జీవనోపాధి చూపించిన రాజమాత ఫౌండేషన్

జీవనోపాధి చూపించిన రాజమాత ఫౌండేషన్

 

ఘట్కేసర్ డిసెంబర్ 16 జనం సాక్షి ఈరోజు ఘట్కేసర్ మండల పరిధిలోని అన్నోజిగూడ వికలాంగుల కాలనీ లో ఉన్న నిరుపేద వికలాంగులకు రాజమాత ఫౌండేషన్ హామీ ఇచ్చిన విధంగా నిరుపేద వికలాంగులైన పద్మ, నిర్మల మరియు వితంతువైన లక్ష్మి అనే మహిళలకు ఒక్కొక్కరికి కుట్టు మిషన్ ఇచ్చి జీవనోపాధి కల్పించిన రాజమాత ఫౌండేషన్. వికలాంగులను, వితంతువులను నిరుపేదలను, అభాగ్యులను, ఆదుకుంటూ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తున్న రాజమాత ఫౌండేషన్ను మరియు ఉదయ్ కుమార్ ను అభినందించారు. రాజమాత ఫౌండేషన్ చేస్తున్న కృషిని మరియు దాతల సహాయ సహకారాలతో నిరుపేద కుటుంబాలలో, జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తున్న ఉదయ్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ వారిని వికలాంగులు ఘనంగా సన్మానించారు. నిరుపేదలను గుర్తించి వారికి దుప్పట్ల పంపిణీ మరియు విద్యార్థులకు ఉపాధి కల్పిస్తూ నిరుద్యోగులకు ఉపాధిని చూపిస్తున్న రాజమాత ఫౌండేషన్ వారికి సీనియర్ జర్నలిస్టు భూతం లింగయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమాత ఫౌండేషన్ ఫౌండర్ ఉదయ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు సంతోష్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు