ఎరుకల సంఘం భవనానికి స్థలం కేటాయించాలి
జహీరాబాద్ డిసెంబర్ 16 (జనం సాక్షి): జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవచూపి ఎరుకల సంఘానికి జహీరాబాద్ పట్టణంలో భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఎరుకల సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి మధుగొండ మహేష్ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎరుకల కులస్తులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.
ఎరుకల సంఘం భవనానికి స్థలం కేటాయించాలి




