జీవ సంబంధ ఎరువులు, పురుగు మందులు వాడాలి
* జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య
టేకులపల్లి,డిసెంబర్ 5( జనం సాక్షి): రైతులు ముందుగా జీవసంబంధ ఎరువులు, పురుగుమందులను వాడాలని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య రైతులకు సూచించారు. ప్రపంచ మృత్తికా దినోత్సవాన్ని పురస్కరించుకొని, ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లోని రైతువేధిక లో రైతులకు సోమవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సేంద్రియ ఎరువులు మర్చిపోయి అధిక దిగుబడులను ఆశించి, రసాయన ఎరువులను, భూమికి అందించడం వలన భూమి నిస్సారము అయి రాబోయే తరాలకు హాని కాలుగుతుందని దానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి అన్నారు. సేంద్రియ ఎరువులైన పశువుల పెంట,కోళ్ల పెంట, వేప చెక్క, వేరుశనగ చెక్క తో పాటు జీలుగ పిల్లిపేసర ,జనుము వేసుకీన్నట్లైతే భూమికి బలం పెరుగుతుందని తెలిపారు. జీవ సంబంధ ఎరువులు, పురుగుమందులు రైతులు మొదట వాడాలని సూచించారు. ఈ కార్యక్రమము లో ఏడిఏ వాసవీ రాణి, మండల రైతుబంధు కోఆర్డినేటర్ లక్కినేని శ్యాం , జిల్లా రైతుబంధు సమితి మెంబర్ కంకణాల విజయ, వైస్ ఎంపీపీ,ఉండేటి ప్రసాద్, ఏవో అన్నపూర్ణ, ఏ ఈ ఓ శ్రావణి, ఎటిఎం ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.




