బిక్షాటన చేస్తున్న పిల్లలను చేరదీసిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ
– పిల్లలకు స్వయంగా స్నానం చేయించి కొత్త బట్టలు అందించిన చైర్ పర్సన్…
-పిల్లలచేత బిక్షాటన చేయించవద్దని తల్లితండ్రులకు కౌన్సిలింగ….
హన్మకొండ బ్యూరో చీఫ్ 5 డిసెంబర్ జనంసాక్షి
నగరంలోని పలు ట్రాఫిక్ కూడళ్లలో గాంధీ వేషధారణతో బిక్షాటన చేస్తున్న ఇద్దరు పిల్లలను చేరదీసిన సంఘటన సోమవారం రోజున జరిగింది, వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు బాలురు (9)(10) సోమవారం రోజున కడిపికొండ ట్రాఫిక్ కూడలి దగ్గర గాంధీ వేశధారణతో బిక్షాటన చేస్తున్నారు అనే సమాచారం చైల్డ్ లైన్ 1098 కు రాగా సంబంధిత చైల్డ్ లైన్ బృందం హుటా హుటిన వెళ్లి సదరు పిల్లలను రెస్క్యూ చేసి వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశ పెట్టగా వారి పరిస్థితిని చూసి చలించిన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్పర్సన్ అన్నమనేని అనిల్ చందర్ రావు బాలలకు స్వయంగా స్నానం చేయించి వారికి కొత్త బట్టలు అందించారు,
అనంతరం అనిల్ చందర్ రావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా కాజీపేట, అదాలత్, కేయూ క్రాస్ రోడ్ ప్రధాన కూడళ్లలో పిల్లల చేత బిక్షాటన చేయించడం జరుగుతుందని ఇట్టి బిక్షస్తనను నివారించుటకు పోలీస్, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్-1098 సంయుక్తంగా పలు మార్లు రెస్క్యూ చేసి వారిని వారి తల్లి తండ్రులకు అప్పగించి స్వంత గ్రామాలకు పంపించడం జరిగిందని, ఐనప్పడికి మళ్ళీ ఇలాంటి సంఘటన పునరావృతం కాగా రెస్క్యూ చేయబడిన ఇద్దరు పిల్లలు ఒంటికి వెండి రంగు పూసుకొని(సునేరు)గాంధీ వేషధారణ తో బిక్షాటన చేస్తున్న సదరు పిల్లలను తల్లి తండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు,
ఇలాంటి సంఘటనకు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని తల్లి తండ్రులను హెచ్చరించారు.
కాగా బాలల పునరావాసం కోసం జైపూర్ బాలల సంక్షేమ సమితి వారికి సమాచారం అందించి తదుపరి చర్యల నిమిత్తం వారి స్వగ్రామానికి పంపించనున్నట్లు తెలిపారు,
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పి సుధాకర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, కే దామోదర్,
పి హైమావతి, బీఆర్బీ కో ఆర్డినేటర్ కే శిరీష, డీసిపివో పి సంతోష్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ రాగి కృష్ణ మూర్తి,
సోషల్ వర్కర్ మెరుగు శ్రీనివాసులు,
మరియు రెస్క్యూ టీమ్ సభ్యులు ఎస్ శృతి,
బి జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.




