హైదరాబాద్, : నగరంలోని అల్వాల్ జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు ఓవరాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చింది. అక్రమ కట్టడాల కూల్చివేతలో జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఇంట్లో ఉండగానే సిబ్బంది ఆ ఇంటిని కూల్చివేశారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జీహెచ్ఎంసీ ఇల్లను కూల్చివేయడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు మండిపడుతున్నారు.




