Thursday, 5 November 2026

పాతబస్తీలో ఘనంగా మోహర్రం

C
హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనంసాక్షి):

మొహరం సందర్భంగా పాతబస్తీలోని డబీర్‌పురా… బీబీకా ఆలం వద్ద మాతం నిర్వహించారు. అనంతరం మొహరం ప్రధాన ఊరేగింపు ప్రారంభమై  పంజేషా, యాకుత్‌పురా తదితర ప్రాంతాల విూదుగా చార్మినార్‌కు చేరుకుంది. దీంతో పాతబస్తీలో యువకుల మాతం నిర్వహించారు. వందలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. షియా ముస్లి సోదరులు ఊరేగింపులో తమను తాము బ్లేడ్‌లు, కత్తులతో గాయపర్చుకుని రక్తం చిందించారు. ఈ సందర్భంగా పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొహర్రం సందర్భంగా శనివారం పాతబస్తీలో నిర్వహించే బీబీ-కా-ఆలం ఊరేగింపు నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు శనివారం ఉదయం 11గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. డబీర్‌పురా నుంచి అలావా బీబీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సునార్‌ గల్లీ టీ జంక్షన్‌ విూదుగా మాతా కీ కిడ్కీ వైపు మళ్లిస్తున్నారు.బీర్‌పురా నుంచి షేక్‌ ఫయాజ్‌ కమాన్‌ వైపు ట్రాఫిక్‌ను అనుమతించడంలేదు. జబ్బర్‌ ¬టల్‌ విూదుగా మళ్లించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *