వ్యభిచారం చేయాల్సిందే.. కృపామణికి గతంలోనూ వేధింపులు

4444తణుకు, అక్టోబర్ 24: పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల్పూరులోని స్థానిక నేత గుడాల సాయిశ్రీనివాస్‌కు కృపారాణిని తల్లిదండ్రులు రూ.7 లక్షలకు అమ్మేశారు. కృపామణితో వ్యభిచారం చేయించాలనే కొనుగోలు సాయిశ్రీనివాస్‌ కొనుగోలు చేశాడు. వ్యభిచారం చేయాలని కృపామణిని అతడు తీవ్రంగా వేధించాడు. తాను చెప్పినట్టు వినకపోతే నగ్న వీడియోలను నెట్‌లో పెడుతానని సాయిశ్రీనివాస్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు.
గతంలోనూ వేధింపులు తాళలేక తల్లిదండ్రులు, సాయిశ్రీనివాస్‌పై కృపామణి కేసు పెట్టింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బెయిల్‌పై వచ్చి తర్వాత కూడా కృపారాణిని నిందితులు వేధింపులకు గురిచేశారు. అప్పటి నుంచి కృపామణికి వేధింపులు మరింత పెరిగాయి. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు.
మరోవైపు తమ కోడలు బంగారు తల్లి అని కృపామణి అత్త వెంకటరమణమ్మ తెలిపారు. కృపామణి ఆత్మహత్యకు కారకులైన నిందితులను ఉరితీయాలి…లేకుంటే నేనే చంపేస్తా అని అత్యంత ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య చాలా మంచిదని కేవలం కృపామణి తల్లి వల్లే ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకుందని భర్త పవన్‌కుమార్ చెబుతున్నాడు.
తల్లిదండ్రులు, సోదరుడు వ్యభిచారంలోకి దింపాలని చూస్తున్నారనే మనస్థాపంతో మంగళవారం కృపామణి వేల్పూరులోని ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

 

తాజావార్తలు