Wednesday, 4 November 2026

జులై రెండో వారంలో హరితహారం:సీఎం కేసీఆర్

హైదరాబాద్: జులై 2వ వారంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ అటవీ శాఖాధికారులకు సూచించారు. ఇవాళ సీఎం హరిత హారంపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వచ్చే ఏడాది 60-70 కోట్ల వరకు మొక్కలు నాటేందుకు కృషి చేయాలని సూచించారు. వాటర్‌గ్రిడ్‌తో నీటికి కూడా కొరత ఉండదన్నారు. రిజర్వాయర్ల దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో నర్సరీలు పెట్టాలని సూచించారు. మొక్కల పెంపకానికి జిల్లాల్లో ఉండే డ్యామ్‌ల నుంచి మంచి నీటిని వాడాలని మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో రక్షించడమూ అంతే ముఖ్యమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *