Thursday, 5 November 2026

జువ్వాడి పై అసత్య ఆరోపణలు మానుకోవాలి

మెట్పల్లి టౌన్, జనవరి21,
జనంసాక్షి :
మెట్ పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం లో మాట్లాడుతూ నిన్న మెట్పల్లిలో బిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి స్వర్గీయ జువ్వాడి రత్నాకర్ రావు పై మరియు ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్ కృష్ణారావు పై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఖండించదగినవని అన్నారు. టీటీడీ బోర్డు స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని దానికి చైర్మన్, డైరెక్టర్లు ఉంటారని వారిని నియమించడం వరకే మంత్రిగా బాధ్యత ఉంటుందని అందులో జరిగే అవకతవకలకు మంత్రి కి ఎలాంటి సంబంధం ఉండదని ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్న ఎమ్మెల్యే కు గాని ఆయన అనుచరులకు గాని ఈ విషయం తెలియక పోవడం బాధాకరమని అలాగే కృష్ణారావు పై చేసిన ఆరోపణలకు ధర్మపురి దేవస్థానం సమక్షంలోనే నిరూపించే దమ్ముందా అని అన్నారు.
మీ ఎమ్మెల్యే పై చేసిన ఆరోపణలను నిరూపించడానికి కాంగ్రెస్ పార్టీగా మేము సిద్ధంగా ఉన్నామని 2011 ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏడు కోట్ల రూపాయలకు క్రాస్ వోటింగ్ వేసిన కారణంగా కెసిఆర్ మిమ్మల్ని నాలుగు నెలలు సస్పెండ్ చేసిన విషయం వాస్తవం కాదా, దీనిపై ప్రగతి భవన్ ముందు నిరూపించడానికి సిద్ధం అని సవాల్ విసిరారు. చేసిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే తెలివి లేక విచక్షణ కోల్పోయి ఇష్టారీతిగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సహించదని తగిన రీతిలో సమాధానం చెప్తామని హెచ్చరించారు.స్థానికత విషయం మాట్లాడే ముందు స్థానికేతరుడైన కేటీఆర్ కు సిరిసిల్లలో ఓట్లు వేయొద్దని స్థానికేతరుడైన కేసీఆర్ కు గజ్వేల్ లో ఓట్లు వేయొద్దని
బిఆర్ఎస్ పక్షాన మీరు పిలుపు ఇవ్వగలరా పదిహేను సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ ఇక్కడ ఓటు హక్కు వున్న వారిని స్థానికేతరులు అని ఎలా అంటారో, మీ అక్రమ కట్టడాలపై మీ భూకబ్జాలపై కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. స్థానిక రాజకళ మందిర్ థియేటర్ సమీపంలో ట్రాలీ ఆటో అడ్డా స్థలం కబ్జా చేసిన విషయంపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని మీ అవినీతి అక్రమాలపై నిరంతర పోరాటం కొనసాగుతుందని వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గద్దె దింపి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలిపారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి లింగం, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇల్లెందుల రాజు, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి రాంప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దుర్గం శేఖర్ , ఉప సర్పంచ్ గోరుమంతల ప్రవీణ్, సీనియర్ నాయకులు బెజ్జారపు శ్రీనివాస్, అబ్దుల్ హఫీజ్, అందే మారుతి, కిసాన్ సెల్ నాయకులు పిడుగు తిరుపతిరెడ్డి, గంగోని క్రాంతి కుమార్, పట్టణ కార్యదర్శి కంబ సురేష్ నాయకులు పుల్లారాజా గౌడ్ గోపిడి అక్కేపల్లి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.