Thursday, 5 November 2026

జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థికి ఘన సన్మానం

మెట్పల్లి టౌన్, జనవరి 21,
జనంసాక్షి :
మెట్పల్లి కేంద్రంలోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శనివారం వారం రోజున పూర్వ విద్యార్థినీ మెట్పల్లి పట్టణముకు చెందిన పర్రే స్నేహ కిరణ్ కు ప్రఖ్యాత విద్యా సంస్థ అయిన ఆకాష్ బైజుస్ లో (జూలాజి ) జంతు శాస్త్ర విభాగములో ఉపాధ్యయురాలిగా ఉద్యోగం సాధించడం జరిగింది,
ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పూర్వ విద్యార్థిని అయిన పర్రి స్నేహ కిరణ్ ను ఘనంగా శాలువాతో సన్మానం చేసి జ్ఞాపిక మెమొంటో అందజేశారు,ఇంతటి విజయం సాధించిన జ్ఞానోదయ కళాశాల పూర్వ విద్యార్థిని స్నేహ కిరణ్ అప్పట్లో మంచి విద్యార్థినీగా కళాశాల టాపర్ గా ఉండేదని
ఆ విధంగా చదువులపై శ్రద్ధతో నైపుణ్యత సాధించి ఇప్పుడు ఉద్యోగం సాధించడం చాలా ఆనందంగా ఉన్నది,విద్యార్థి విద్యార్థులు కూడా దీనిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఉన్నత శిఖరాలకు చేరాలని కళాశాల తరఫున ఆశిస్తున్నామని కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ అన్నారు, ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, డైరెక్టర్ మహేందర్ గౌడ్, వేణుగోపాల్,కమలాకర్ రావు,ప్రిన్సిపాల్ సంతోష్,వైస్ ప్రిన్సిపాల్ రాజు,ఆధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు .