Tuesday, 3 November 2026

జూనియర్‌ కాలేజీలకు వేసవి సెలవులు

హైదరాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు ఈ నెల 30 నుంచి వేసవి సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు తెలిపారు. మే 31వరకు సెలవులు కొనసాగుతాయని, జూన్‌ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే ఆయా కళాశాలలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్‌ కాలేజీలుఏ రకంగా అయినా కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలోని బీసీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో ఆరో తరగతి ప్రవేశానికి ఏప్రిల్‌ 30న పరీక్ష నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సెక్రటరీ మల్లయ్య బట్టు తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 10లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 8 వరకు గడువు ఉన్నట్లు వెల్లడించారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 21న నిర్వహించనున్నట్లు తెలిపారు.