జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో తమను రెగ్యులర్ చేయాలని, ప్రోబేషనరి కాలంను సర్వీస్ సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంథని ఎంపీడీఓ ఆఫీస్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి శుక్రవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు . భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట బిజెపి అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.




