Tuesday, 3 November 2026

జూనియర్ పంచాయతీ కార్యదర్శుల దీక్షకు సంఘీ భావం తెలిపి 10వేల రూపాయలు అందజేసిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ మే 04 జనం సాక్షిగ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించి వెంటనే రెగ్యులర్ రేట్ చేయాలనీ డిమాండ్ ఎక్కువ గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమని వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఉప్పరి ప్రసాద్ ఆరోపించారు గురువారం మండల పరిషత్ కార్యాలయం ముందు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న బి ఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు తీరని అన్యాయం చేస్తూ కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అన్ని రకాల పనులు చేస్తూ వారిని ఇప్పటివరకు రెగ్యులర్ రేట్ చేయకపోవడం విడ్డూరమన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్ పంచాయతీ కార్యదర్శిలను వెంటనే రెగ్యులర్ రేట్ చేసి వారి కుటుంబాలు విరిగిన పడకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ యువజన నాయకులు విద్యార్థి నాయకుడు శశి వర్గం వివిధ మండలాల వివిధ మండలాల వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తదితగులు పాల్గొన్నారు