Wednesday, 4 November 2026

జూన్ 12న కలెక్టరేట్ ఆఫీసు ముందు ధర్నాను జయప్రదం చేయండి

టేకులపల్లి, జూన్ 5( జనం సాక్షి ): జూన్ 12న జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు తలపట్టే ధర్నాను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, ఇల్లందు ఏరియా కన్వీనర్ అబ్దుల్ నబీ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఅనేక సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్లు పేద ప్రజలకు సేవలను అందిస్తున్నారు. ఆసుపత్రిలో డెలివరీలు చేయించడం ద్వారా మాతా శిశు మరణాలను తగ్గించడంలో ఆశా వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇంకా అనేక ఆరోగ్య సేవలను ప్రజలకు ఆశా వర్కర్లు నిరంతరం అందిస్తున్నారు. ఎన్నో సేవలు చేస్తున్న ఆశా వర్కర్లను మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంవత్సరాల తెలపరి నిర్లక్ష్యం చేస్తున్నాయి. కనీస వేతనం పెన్షన్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర చట్టబద్ధ సౌకర్యాలు ఏమి ఇప్పటివరకు కల్పించడం లేదు. కనీసం ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు. పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కొత్తగా ఆశలకు ఎగ్జామ్ నిర్వహించి అందులో ఉత్తీర్ణత సాధించనీ ఆశాలను ఇంటికి పంపాలని నిర్ణయం చేసింది. ఇది ఆశలను కించపరచడంతో పాటు ఆశాల సీనియర్ టిని తగ్గించి ఉద్యోగ భద్రత లేకుండా చేయడం తప్ప మరొకటి కాదు,ఆశాలకు నష్టం కలిగించే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. పెరుగుతున్న ధరలు కలుగునంగా ఆశాల వేతనాన్ని 18 వేలకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ జూన్ 12న కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ఎటువంటి కార్యక్రమంలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొనాలని సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉ�