Wednesday, 4 November 2026

బొడ్రాయి ఉత్సాహాలకు పాల్గొన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

 

వీణవంక జూన్ 5 (జనం సాక్షి )వీణవంక మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ఉత్సాహాలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గ్రామని కి సోమవారం హాజరయ్యారు ఈ సందర్భంగా భూలక్ష్మి మహాలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు వేద పండితుల గూడ జగదీశ్వర్ శర్మ తో నిర్వహించారు అనంతరం విరాళం ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలలో గ్రామ దేవతల ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు గ్రామానికి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతి రెడ్డి. జడ్పిటిసి మాడ వనమాల సాధవ రెడ్డి.సర్పంచ్ల ఫోరోమ్ అధ్యక్షుడు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి. స్థానిక సర్పంచ్ దాసారపు సుజాత లక్ష్మణ్. సర్పంచులు నీల కుమారస్వామి. మేకల సమ్మిరెడ్డి ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్. నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి తో పాటు నాయకులు గ్రామస్తులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.