Thursday, 5 November 2026

జూన్ 2న రాజీవ్ గాంధీ యూత్ ఆన్ లైన్ క్విజ్ కాంపిటీషన్  సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్

 

 

 

 

 

 

సూర్యాపేట ప్రతినిధి, మే 16 (జనంసాక్షి): హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ కు కొనసాగింపుగానే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ తెలిపారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మొదటి మూడు బహుమతులుగా ల్యాప్ టాప్ , స్మార్ట్ ఫోన్, ట్యాబ్ లెట్ అందజేయనున్నట్లు తెలిపారు. ప్రోత్సాహక బహుమతులుగా స్మార్ట్ వాచ్, ఇయర్ ప్యాడ్స్, హార్డ్ డ్రైవ్, పవర్ బ్యాంకులను అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని మహిళా టాపర్లకు ఎలక్ట్రిక్ స్కూటీని బహుమతిగా ఇస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వెబ్ లింకుతో కూడిన ఎస్ఎంఎస్ ను పొందటానికి 7661899899 కు మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపారు. రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ జూన్ 1 అని తెలిపారు. ఈ కాంపిటీషన్ లో పాల్గొనేందుకు 16 నుంచి 35 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని తెలిపారు. జూన్ 2న జరిగే రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు యండి అంజాద్ అలీ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మామిడి వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి నాగుల వాసు, చెరుకు రాము, జిల్లా కాంగ్రెస్ సేవ దళ్ చీఫ్ ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యలగందుల సాయినేత , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉబ్బాని రఘుపతి, కోడి శివ, పసుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.