నెన్నెల, మే 16, (జనంసాక్షి )నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం నిర్వహించారు. డెంగ్యూ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరించారు. ఈకార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ యశోద, ఫార్మసిస్ట్ నారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ సుధీర్, హెల్త్ అసిస్టెంట్లు రాజ్ కుమార్, ప్రభాకర్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.




