మదీన : జూపార్కులో బోనులోంచి తప్పించుకున్న బెంగాల్ టైగర్‌కు అధికారులు మత్తు మందు ఇచ్చి తిరిగి బంధించిన సంగతి తెలిసిందే. ఈ టైగర్ ఆదివారం మత్తు మందు నుంచి తేరుకొని పూర్తిగా కోలుకుందని క్యూరేటర్ గోపీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వెటర్నరీ వె ౖద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిచ డంతో త్వరగా కోలుకుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం సందర్శకుల సంఖ్య పెరిగిం ది. గత ఆదివారంతో పోల్చితే 30శాతం మం ది సందర్శకులు ఎక్కువగా వచ్చారని ఆయన తెలిపారు. సందర్శకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని స్పష్టం చేశారు.




