రాయదుర్గం: ప్రజల సహకారంతో నేరాలను అరికట్టడంలో పోలీసులు సత్ఫలితాలను సాధిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ అన్నారు. నేరాలు జరుగుతున్నప్పుడు వెంటనే స్పందించి అడ్డుకొని పోలీసులకు సహకరిస్తున్న ప్రజలను మరింత ప్రోత్సహించేందుకు అవార్డులను అందజేస్తున్నామని తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించిన వారికి గుడ్ సిటిజన్ అవార్డులను ఆయన అందజేశారు. అవార్డు కింద వెయ్యి రూపాయలు, ప్రశంసాపత్రం ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి అవార్డులను ప్రకటిస్తున్నారు. ఈసారి 9 మంది పౌరులు ఈ అవార్డును అందుకున్నారు. ఎర్ర చంద్రశేఖర్, సరిపల్లి సునీల్‌వర్మ, సరోజ, రడపాల సరోజ, కె.అమల, జె.అనురాధ, వెంకటమ్మ, బేజగమ్ కేశవులు, అబ్దుల్‌సలీం అవార్డులు అందుకున్నారు.




