Wednesday, 4 November 2026

భక్తిశ్రద్ధలతో కావడియాత్ర

రాజేంద్రనగర్‌ : శ్రావణ మాసం శివుడికి ప్రీతిపాత్రమైన మాసమని భావిస్తూ అత్తాపూర్‌ అంబియన్స్‌ పోర్ట్‌కు చెందిన సుమారు 300 మంది భక్తులు ఆదివారం ఉదయం కాలనీ నుంచి కాలినడకన కావడి యాత్రతో రాంబాగ్‌ చిన్న అనంతగిరి శివాలయానికి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో అంబియన్స్‌ ఫోర్ట్‌ రెసిడెన్స్‌ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.అమర్‌నాథ్‌, నిర్వాహకులు పంకజ్‌ అగర్వాల్‌, గణేష్‌ గుప్త, ప్రణవభక్త సమాజం అధ్యక్షుడు మోండ్ర నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మచిలేశ్వరుడికి …..
నార్సింగ్‌: శ్రావణ మాసం పురస్కరించుకుని ఆదివారం నగరంలోని మార్వాడి కుటుంబాల వారు మంచిరేవుల గ్రామంలో మూసీనది ఒడ్డున గల చారిత్రక మచిలేశ్వర్‌స్వామి దేవాలయానికి కావడి యాత్ర నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *