హైదరాబాద్: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మృతిచెందడంతో బంధువులు ఆందోళనకు దిగిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ వైద్యం వికటించడంతో మృతిచెందింది. అయితే ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.




