పెళ్లి పీటలపై పెళ్లికొడుక్కి దేహశుద్ధి జరిగింది. తాళి కట్టాల్సిన సమయంలో పెయ్యంతా సున్నం అయ్యింది. ఓ అమ్మాయిని ప్రేమించి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమైన యువకున్ని ప్రియురాలి బంధువులు చితకబాదారు. అవాక్కైన పెళ్లి కూతురు బంధువులు.. ప్రియురాలి బంధువులపై విరుచుకుపడ్డారు. తీరా సమయానికి వచ్చి పెళ్లి ఆపడం ఏంటని ఎదురుపడి కొట్టుకున్నారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ప్రియురాలు, ప్రియునితో పాటు ఇరువురి బంధువులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేపట్టారు.




