Tuesday, 3 November 2026

సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుతాం

తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా సినీ పరిశ్రమకు సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో తెలుగు సినీ కళా దర్శకుల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమను కంటికి రెప్పలా కాపాడుతామని స్పష్టం చేశారు. ఈ నెల 20న సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. త్వరలోనే ఉగాది పురస్కారాల పేరు, లోగో ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *