Wednesday, 4 November 2026

జెరూసలెం వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్

హైదరాబాద్: వైఎస్‌ జగన్‌ జెరూసలేంకు వెళ్లాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. జూన్‌ లేదా జులైలో జెరూసలేంకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్‌ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆధీనంలో ఉన్న పాస్‌పోర్టును తిరిగి ఇవ్వడంతో పాటు.. తన పర్యటనకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే కేసు విచారణ కీలక దశలో ఉన్న తరుణంలో జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వకూడదని సీబీఐ అభ్యంతరం తెలిపింది. కేసును జాప్యం చేసేందుకే జగన్‌ ఇలాంటి అనుమతులు కోరుతున్నారని సీబీఐ కోర్టుకు వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *