Wednesday, 4 November 2026

భూసేకరణ బిల్లును నిరసిస్తూ మహాసభ తీర్మానం:ప్రకాశ్ కరత్

విశాఖ: భూసేకరణ బిల్లును నిరసిస్తూ మహాసభ తీర్మానం చేసిందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తెలిపారు. విశాఖలో సీపీఎం 21 వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. నిన్న ప్రారంభం అయ్యాయి. ఈనెల 19 వరకు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన వీడియాతో మాట్లాడారు. సమీక్షా నివేదికను మహాసభలో ప్రవేశపెట్టామని.. ఈ రోజు, రేపు నివేదికపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఎస్సీల సమస్యలను చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్ పై మోడీ సర్కార్ ఇస్తున్న వివరణ అర్థరహితమన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్… గిరిజనులు, ఆదివాసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. భూసేకరణ బిల్లును ప్రతిపక్షాలతో కలిసి తిప్పికొట్టాలని మహాసభ తీర్మాణం చేసిందని చెప్పారు. దేశంలోని వామపక్షాల్లో సీపీఎం అతి పెద్ద పార్టీ అని తెలిపారు. సీపీఎంను బలోపేతం చేయడానికి భవిష్యత్ లో ఎలాంటి విధానాలు, ఎత్తుగడులు పాటించాలో చర్చిస్తున్నామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *