కర్నూలు:రాష్ట్రంలో అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పారు. పెన్షన్లను అందజేయడంలో బయోమెట్రిక్ ఇబ్బందులను పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి సహచర మంత్రులు అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి ఆయన పాల్గొన్నారు.




