వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 29 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని రంగసాయిపేటకు చెందిన శంకేష్ నిహాల్ పటేల్ జేఈఈ మెయిన్స్ ఆల్ ఇండియా లో 2157 ర్యాంకును సాధించాడు ఈ మేరకు విద్యార్థి తల్లిదండ్రులు శంకేసి శ్రీనివాస్ మాధవి శనివారం తెలిపారు. నిహాల్ పటేల్ పదవ తరగతిలో 10/10 జిపిఎఫ్ పొందాడని అలాగే ఇంటర్మీడియట్ హైదరాబాదులోని శ్రీ చైతన్య ఐఐటి అకాడమీలో చదివినట్లు విద్యార్థి తల్లిదండ్రులు చెప్పారు ఈ ర్యాంకు సాధించడంలో నిహాల్ పటేల్ తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయులు ప్రోత్సాహం ఎంతో ఉన్నట్లు తెలిపారు నిహాల్ పటేల్ కు ఆల్ ఇండియాలో కంప్యూటర్ సైన్స్‌లో ఐఐటీ బాంబేలో చేయాలని కోరిక ఉన్నట్లు నిహాల్ పటేల్ తెలిపాడు




