జనం సాక్షి : దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో నూతనంగా ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన ను తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శనివారం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ , మేడ్చల్ జిల్లా ఆరోగ్యాధికారి పుట్ల శ్రీనివాస్ , వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి , స్థానిక కౌన్సిలర్ రామారం శ్రీహరి గౌడ్ , కమిషనర్ స్వామి , డి ఇ సుమతి డాక్టర్లు సరిత , కృతిక కౌన్సిలర్లు , కో ఆప్షన్ మెంబర్లు , మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .




