బెల్లంపల్లి, మార్చి 1, (జనంసాక్షి )బుధవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించిన జెఈఈ మెయిన్స్ బిఆర్క్ పరీక్షా ఫలితాల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పొట్టాల విష్ణు 97.8 పర్సెంటైల్, అల్లూరి శివప్రసాద్ 95.5 పర్సెంటైల్ సాధించి తమ సత్తాను జాతీయస్థాయిలో చాటడం విశేషం. ఈ ఇద్దరు విద్యార్థులూ నిరుపేద వ్యవసాయ కూలీల పిల్లలే. విష్ణు పుల్లగామ గ్రామం, కోటపల్లి మండలం కు చెందిన తిరుపతి- సారక్క ల కుమారుడు కాగా శివకుమార్ జనగామ గ్రామం, కోటపల్లి మండలం. లక్ష్మీ -రాజన్న ల కుమారుడు. జాతీయస్థాయిలో అత్యంత ప్రతిభ చూపిన వీరికి ఎన్ఐటి తిరుచి మెయిన్ క్యాంపస్ లో సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా వీరిద్దరిని బుధవారం ప్రిన్సిపల్ ఐనాల సైదులు పుష్పగుచ్చాలతో అభినందించారు. సంక్షేమం గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ కొప్పుల స్వరూప రాణి ఫోన్ ద్వారా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. గతంలో జేఈఈ మెయిన్స్ బీటెక్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 14 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ కు అర్హత సాధించారు వీరిద్దరితో కలిపి మొత్తం కళాశాల నుండి 16 మంది అడ్వాన్స్ కు అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. కళాశాలలో జరిగిన అభినందన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజకుమార్, జెవిపి దాసం అజిత, నాగిని శ్రీరామ వర్మ, మిట్ట రమేష్, చందా లక్ష్మీ నారాయణ, సురేష్ గౌడ్, కట్ల రవీందర్ ,సుంకరి అర్జున్, అనిరుద్, రాజేందర్, రాజేష్, రఫీ తదితరులు పాల్గొన్నారు
జేఈఈ మెయిన్స్ బిఆర్క్ ఫలితాల్లో బెల్లంపల్లి సిఓఈ అత్యుత్తమ ప్రదర్శన: అభినందించిన ప్రిన్సిపల్, అధ్యాపకులు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య




