Monday, 2 November 2026

అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం* మిర్యాలగూడ లో జరిగిన సమ్మెలో తుమ్మల వీరారెడ్డి

మిర్యాలగూడ, జనం సాక్షి అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం నిర్వహిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి చెప్పారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల సమ్మెలో భాగంగా మొదటి రోజు బుధవారం అంగన్వాడీలు సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం సిడిపిఓ మమతకు వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి లను తగ్గించాలని కోరారు. అంగన్వాడి కేంద్రాలకే ఫుడ్ సరఫరా చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రా డ్యూటీ చెల్లించాలన్నారు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు.టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. 2018 అక్టోబర్ లో కేంద్రం పెంచిన వేతనం అంగన్వాడీ టీచర్లకు రూ. 1,500/-లు, హెల్పర్లకు రూ.750/-లు.మినీ వర్కర్లకు రూ.1,250/-లు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్తో సహా చెల్లించాలన్నారు.2017 నుండి టిఎ, డిఎ బకాయిలు మొత్తం చెల్లించాలని, దీనికి సరిపడా బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేయాలన్నారు.. 3 సం॥రాల రేషన్ షాపు ట్రాన్స్పోర్ట్ చార్జీలను వెంటనే చెల్లించాలన్నారు.  పిఆర్సి ఎరియర్స్ 2021 జూలై, అక్టోబర్, నవంబర్ మూడు నెలలని వెంటనే చెల్లించాలని, ఖాళీపోస్టులు వెంటనే భర్తీ చేసి ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. మదర్స్ కమిటీలకు చైర్మెన్ తల్లులను మత్రమే నియమించాలని,. గ్రామ సర్పంచులను చైర్మన్ నియమాకం చేసే పద్ధతిని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఆరోగ్య లక్ష్మి మెమా ఛార్జీలు పిల్లలకు రూ.1.15 ల నుండి రూ.5/-లకు, గర్భిణీ/బాలింతలకు రూ.2.40 సైల నుండి రూ.10/-లకు పెంచాలి. డబుల్ సిలిండర్ అన్ని కేంద్రాలకు ఇవ్వాలన్నారు. ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లంటినీ మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని కోరారు. అంగన్ వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు.  2017 నుండి ఇంక్రిమెంట్, ఇన్ఛార్జ్ అలవెన్స్ బకాయిలు చెల్లించాలన్నారు. ఎన్ న్టిటిఎస్ యాప్ ను పూర్తిగా రద్దు చేయాలని,. కేవలం పోషన్ ట్రాకర్ మాత్రమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్లైన్పని చేయడానికి వీలుగా ఐప్యాడ్ ఇవ్వాలని,   . ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని,  అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాలకు (ఈవెంట్స్) ఇచ్చే డబ్బులు రూ. 250/-ల నుండిరూ.2,000/- లకు పెంచాలన్నారు. రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వెహికల్ ద్వారానే సప్లై చేయాలన్నారు.  ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. జివో నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు.అంగన్వాడీ ఉద్యోగులకు ఆసరా, కళ్యాణలక్ష్మి, తదితర ప్రభుత్వ సంక్షేమ పధాకలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, నూకల జగదీశ్ చంద్ర, ఆయూబ్, మాధవరెడ్డి, వాడపల్లి రమేష్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు పార్వతి నాయకురాలు ప్రమీల, తుడి అరుణ, స్వరాజ్యం బెజ్జం నాగమణి, స్వరాజ్యం, జి. రజిత, ఝాన్సీ, రాధాబాయి, విజయ, శేషు మని, గౌసియా, చంద్రకళ, మండే వనజ, నాగమణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.