Tuesday, 3 November 2026

జేఎన్‌టీయూలో ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులకు నేడే ఆఖరు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 770 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో ఇచ్చే ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బీసీ / బీటెక్‌ సివిల్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని గతంలోనే తెలిపారు. వర్సిటీ పీఐయూ, కార్డ్‌ సంయుక్తంగా ఈనెల 31 నుంచి సెప్టెంబర్‌ 18వ తేదీ వరకు తర్ఫీదు ఇస్తున్నట్టు తెలియజేసిన ఆ విభాగం అధికారి నిమ్మానాయక్‌, ఆసక్తిగల అభ్యర్థులు బుధవారం సాయంత్రం 4.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 040-23151974ను సంప్రదించగలరన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *