హైదరాబాద్: దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో కుంభకోణానికి సంబంధించి ఆప్ ప్రభుత్వం విచారణ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. చేతన్ సంఘీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఇందుకు సంబంధించిన విచారణను పూర్తి చేసి 237 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికలో కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.డీడీసీఏ నిర్లక్ష్య వైఖరి, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, క్రీడాకారుల వయసుకు సంబంధించి నకిలీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయటం తదితర అంశాలపై విచారణ కమిటీ ప్రధానంగా దృష్టిసారించింది. ఎక్కడా జైట్లీ పేరును మాత్రం పేర్కొనలేదు.




