జైపూర్ విద్యుత్ పవర్ ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
ఆదిలాబాద్,మార్చి3(జనంసాక్షి): ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పటవుతున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ మూడో యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. మూడు సంవత్సరాల్లో ఈ విద్యుత్ తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. దీంతో కొంతమేరకు విద్యుత్ అవసరాలు తీరుతాయి. సిగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబీషన్‌ను సీఎం తిలకించారు. అనంతరం ఇప్పటి వరకు జరిగిన పవర్‌ప్‌ఆట్ నిర్మాణం పురోగతిపై సింగరేణి సీఎండీ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులతో సవిూక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న, విప్ ఓదేలు, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వచ్చే మూడేండ్లలో రాష్టాన్న్రి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. 2017 తర్వాత తెలంగాణలో పుట్టే బిడ్డలకు కరెంటు కోత అనేది తెలియకుండా చేస్తామని స్పష్టం చేశారు. 2017 నాటికే తెలంగాణ రైతాంగానికి ఒకటే వరుసలో ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటలవరకు నిరంతర విద్యుత్తు సరఫరాచేసే బాధ్యత కేసీఆర్‌దే అని చెపుతున్నా. 2017 తర్వాత మన రాష్ట్రంలో పుట్టే బిడ్డలకు కరెంటు కోత అంటే ఏమిటో తెలియకుండా చేస్తానని రాయికల్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తికి సిఎం కెసిఆర్ శ్రీకారం చుట్టారు. 2018 నాటికి తెలంగాణ 23వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్తు శక్తి సామర్థ్యంతో మిగులు రాష్ట్రంగా ఉంటుందని ప్రకటించారు. ఇక వచ్చే సంవత్సరం.. సంవత్సరంన్నరలోగా చత్తీస్‌గఢ్‌నుంచి 2 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. ఇక భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్‌లో మరో 600ల మెగావాట్ల విద్యుత్తు ఈ అక్టోబర్‌కు అందుబాటులోకి వస్తున్నది. ఆదిలాబాద్ జైపూర్ సింగరేణి విద్యుత్ యూనిట్ నుంచి 1200ల మెగావాట్ల విద్యుత్తు ఈ నవంబర్‌నాటికే అందబోతున్నది. ఇంకా రూ.36వేల కోట్లతో తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో 6వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి మనం శ్రీకారం చుట్టినం. దాని పనులన్నీ త్వరలో టేకాఫ్ అవుతున్నాయి. రాష్ట్ర పునర్‌విభజన చట్టం పొందుపరిచిన విధంగా ఎన్టీపీసీ నాలుగువేల మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని స్థాపించి దాన్ని పూర్తిగా తెలంగాణకే ఇవ్వాలని చెప్పింది. 1600ల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి పనులు ప్రారంభమయ్యాయి. నల్గొండ జిల్లా దామరచర్లలో త్వరలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంటు కూడా ప్రారంభం కాబోతున్నది.