Tuesday, 3 November 2026

రైలు నుంచి దూకిన విద్యార్థి మృతి

విజయనగరం,మార్చి3(జ‌నంసాక్షి):  రైలు నుంచి దూకిన విద్యార్థి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాడంగికి చెందిన ఎం.కిశోర్‌ హఠియ-యశ్వంతపూర్‌ రైలులో విజయవాడ నుంచి బొబ్బిలికి బయలుదేరాడు. రైలు బొబ్బిలి స్టేషన్‌లో ఆగేలోపే అందులోంచి కిందికి దూకాడు. ప్రమాదవశాత్తూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కిశోర్‌ విజయవాడలో పాలిటెక్నిక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. స్వగ్రామం బాడంగికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. శవాన్ని పంచనామాకు పంపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *