Tuesday, 3 November 2026

జైల్‌ భరోకు పెన్షనర్ల మద్దతు

హైదరాబాద్‌,మార్చి3(జ‌నంసాక్షి):  కేంద్రంలోని మోడీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈనెల 26న చేపట్టిన జైల్‌భరో కార్యక్రమానికి పెన్షనర్స్‌అసోసియేషన్‌ మద్దతు  ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎంఎన్‌ రెడ్డి  ఓ ప్రకటన విడుదల చేశారు. కార్మిక చట్టాలను కేంద్రం సవరించడాన్ని తీవ్రంగా ఖండించారు. నూతన పెన్షన్‌ విధానాన్ని ఉపసంహరించాలని కోరారు. జైల్‌భరో కార్యక్రమంలో తాము పాల్గొంటామని తెలిపారు. కనీస పెన్షన్‌ రూ.6500 ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెన్షనర్లకు వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలని కోరారు. డిఎను మూలవేతనంలో కలపడానికి కేంద్రం చొరవ చూపడం లేదని విమర్శించారు. ఏడో వేతన సవరణ కమిషన్‌ సూచించిన విధంగా ఐఆర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *