Tuesday, 3 November 2026

బాక్సైట్‌ తవ్వకాలను అడ్డుకుంటాం

విశాఖపట్టణం,మార్చి3(జ‌నంసాక్షి): విశాఖ ఏజెన్సీ ప్రారతరలో బాక్సైట్‌ను తవ్వకాలకు, గిరిజన చట్టాలను సవరించేందుకు టీడీపీ ప్రభుత్వర చేస్తున్న ప్రయత్నాలను గిరిజనులరతా సమష్టిగా తిప్పికొట్టాలని మాజీ ఎమ్మెల్యే జి. దేముడు పిలుపునిచ్చారు. అందుకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని కోరారు. ఈ నెల 7 నుంచి శాసనసభలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నందున గిరిజన సలహా మండలిలో బాక్సైట్‌ తవ్వకాల అంశాన్ని తీర్మానం చేయొచ్చని భావిస్తున్నానని అన్నారు. ఇప్పటికైనా గిరిజన ప్రారత ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మేధావులు స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్మికులు, రైతులు ప్రజా పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చరద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా  గిరిజనులకు అండగా నిలుస్తానని, బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకిస్తానని, ప్రజా వ్యతిరేక ఉద్యమానికి మద్దతిస్తానని శాసనసభలో ప్రకటించారన్నారు. అధికారంలో వచ్చాక మాట మార్చారన్నారు. టీడీపీ బాక్సైట్‌ తవ్వకాలకు అనుకూలంగా ఉంటే వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌కు సంబరధించిన కరపెనీ మాకవర పాలెంలో ఉరదని, దీనిబట్టి బాక్సైట్‌ ఉన్న నియోజక వర్గాల గిరిజన ఎమ్మెల్యేలు వ్యతిరేకించేందుకు ముందుకు వచ్చినప్పటికీ అధినేత బెదిరింపులకు భయపడి మద్దతునిచ్చే ప్రమాదం పొంచి ఉందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *