Thursday, 5 November 2026

జోగిపేటలో కార్యాలయంలో 74వ గణతంత్ర దినోత్సవం పాల్గొన్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి జోగుపేట ఆందోల్ గురువారం 74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ దావకాన పోలీస్ స్టేషన్ కార్యాల్లో ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొని ఆందోల్ నియోజకవర్గం ప్రజలందరికీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1950 జనవరి 27న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని అప్పటి నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి మరువలేదని భారత రాజ్యాంగ విశిష్టత ప్రతి పౌరుడు తెలుసుకొని మహనీయుల బాటలో నడవాలని ప్రతి ఒక్కరూ తమ విధులను సక్రమంగా నిర్వహిస్తూ దేశ ప్రగతిని పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలయ్య మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు అధికారులు బి ఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు